నేడు గోల్డ్ రేట్స్ ఇవే

బంగారం ధరలు స్థిరంగా ఉండటంతో కొనుగోలుకు ఇదే మంచి సమయమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు

Update: 2022-10-15 03:18 GMT

బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మూడు రోజులు వరసగా పెరిగిన బంగారం ధరలు నేడు స్థిరంగా కొనసాగడం కొంత కొనుగోలు దారులకు ఊరట కల్గించే అంశమే. వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. కిలో కు రూ.200లు తగ్గింది. బంగారం అంటేనే హెచ్చు తగ్గుదల ఉంటాయి. పెరిగినప్పుడు భారీగా, తగ్గినప్పుడు స్వల్పంగా బంగారం ధరలు ఉంటాయి. అందుకే పెరిగినా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. తమ వద్ద ఉన్న కొద్దిపాటి డబ్బులతో వచ్చిన బంగారాన్ని కొనుగోలు చేయడానికి సుముఖత చూపుతారు. అంతేకాకుండా బంగారం ఇప్పుడు పెట్టుబడిగా భావించడంతో బంగారానికి డిమాండ్ మరింత పెరిగింది. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటివి బంగారం ధరల్లో మార్పునకు కారణంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

తగ్గిన వెండి...
బంగారం ధరలు స్థిరంగా ఉండటంతో కొనుగోలుకు ఇదే మంచి సమయమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీపావళి నాటికి ధరలు మరింత పెరిగే అవకాశముందంటున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,750 రూపాయలు పలుకుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,000 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి ధర స్వల్పంగా తగ్గి ప్రస్తుతం 63,300 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News