కన్నీరు పెట్టుకున్న మోడీ

ప్రధాని మోదీ కన్నీటి పర్యంత మయ్యారు. తుర్కియే, సిరియా దేశాల్లో భూకంపం మృతులకు సంతాపం ప్రకటిస్తూ భావోద్వేగానికి గురయ్యారు

Update: 2023-02-08 02:12 GMT

ప్రధాని నరేంద్ర మోదీ కన్నీటి పర్యంత మయ్యారు. ఆయన తుర్కియే, సిరియా దేశాల్లో భూకంపం మృతులకు సంతాపం ప్రకటిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ ఘటన జరిగింది. 2001లో గుజరాత్‌లోని భుజ్ లో సంభవించిన భూకంపంతో దాదాపు ఇరవై వేల మంది మృత్యువాత పడ్డారు. ఇది గుర్తుకు తెచ్చుకున్న మోదీ కన్నీరు పెట్టుకున్నారు. తుర్కియేకు మానవతా సాయాన్ని అందచేస్తున్నట్లు ప్రకటించారు.

నాటి సంఘటనను...
నాడు భుజ్ లో ఇరవై వేల మంది చనిపోగా, లక్షన్నర మంది గాయపడ్డారన్నారు. వేల మంది నిరాశ్రయులయ్యారని గుర్తుకు తెచ్చుకున్నారు. తుర్కియా దేశానికి భారత్ అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. మనకు వీలయినంత సాయాన్ని అందించి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందన్న మోదీ, ఇలాంటి కష్టం మరెవ్వరికీ రాకూడదని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురి కావడంతో బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో కాసేపు ఉద్విగ్న వాతావరణం నెలకొంది.


Tags:    

Similar News