‍‍‍Narendra Modi : వారణాసిలో మోదీ నామినేషన్

చివరి దశ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో నామినేషన్ దాఖలు చేశారు;

Update: 2024-05-14 06:42 GMT
‍‍‍Narendra Modi : వారణాసిలో మోదీ నామినేషన్
  • whatsapp icon

చివరి దశ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో నామినేషన్ దాఖలు చేశారు. మూడో సారి ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో వరసగా గెలిచిన మోదీ హ్యాట్రిక్ విజయం సాధించేందుకు ఆయన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. మోదీ నామినేషన్ సమర్పిస్తున్న సమయంలో ఆయన వెంట కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాధ్ సింగ్ తో పాటు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ తో పాటు పలువురు ఎన్డీఏ నేతలున్నారు.

ఆయన వెంట...
నామినేషన్ పత్రాలను సమర్పించిన అనంతరం ర్యాలీలో పాల్గొన్న తర్వాత బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ఉదయం దశాశ్వమేధ ఘాట్ వద్ద మోదీ పూజలు నిర్వమించారు. అనంతరం కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాశీవిశ్నాధుడి ఆలయంలో పూజలు చేసిన అనంతరం రాత్రి అక్కడే బస చేసిన మోదీ కొద్దిసేపటి క్రితం నామినేషన్ ను దాఖలు చేశారు. నామినేషన్ అనంతరం బీజేపీ కార్యకర్తలతోనూ మోదీ సమావేశం కానున్నారు.


Tags:    

Similar News