Railway Jobs : పదో తరగతి పాస్ అయ్యారా ? అయితే రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు రెడీ

తూర్పు మధ్య రైల్వేలో అప్రెంటీస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలయింది. ఇందుకు విద్యార్హత పదో తరగతి లేదా ఐటీఐ

Update: 2023-11-21 14:48 GMT

రైల్వేలో ఉద్యోగం అంటే అంతకంటే ఏం కావాలి? రైల్వేశాఖ లో ఉద్యోగమంటే కావాల్సినంత జీతం.. ప్రతి ఏడాది వచ్చే ప్రయోజనాలు, పెరిగే డీఏలు ఇవన్నీ యువతను ఎప్పటికప్పుడు ఊరిస్తూనే ఉంటాయి. ఒకప్పుడు బ్యాంకుల్లో ఉద్యోగాలు ఎంత క్రేజ్ ఉండేదో.. ఇప్పుడు రైల్వే శాఖలో ఉద్యోగానికి అంతే క్రేజ్ ఉంది. ఒకసారి రైల్వే ఎంప్లాయీ అయితే చాలు ఇక జీవితం స్థిరపడినట్లే. జీతం విషయం కూడా ఆలోచించాల్సిన పనిలేదు. జీవితం సాఫీగా, సుఖంగా సాగిపోతుందన్న నమ్మకం.

తూర్పు సెంట్రల్ రైల్వేలో...
ప్రస్తుతం తూర్పు మధ్య రైల్వేలో అప్రెంటీస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలయింది. ఇందుకు విద్యార్హత పదో తరగతి లేదా ఐటీఐ మాత్రమే. పదో తరగతి ఉత్తీర్ణులయిన వారంతా ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 1,832 యాక్ట్ అప్రెంటిస్‌ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందుకోసం తూర్పు మధ్య రైల్వే ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరింది. దానాపూర్ డివిజన్, సోన్‌పూర్ డివిజన్, సమస్తిపూర్ డివిజన్, ప్లాంట్ డిపో, మెకానికల్ వర్క్‌ షాప్ సమస్తిపూర్ లో ఈ ఉద్యోగాలు ఉంటాయి.
పోస్టులివీ....
ఫిట్టర్, వెల్డర్, మెకానిక్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, వైర్ మ్యాన్, ఎలక్ట్రీషియన్, ‌ఎంఎంటీఎం, టర్నర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్, ఫోర్జర అండ్ హీట్ ట్రీటర్, కార్పెంటర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, బ్లాక్ స్మిత్, లేబొరేటరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు తీసుకుంటారు. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నాటికి పదిహేనేళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య వయసు ఉండాల్సి ఉంటుంది. టెన్త్, ఐటీఐ మర్కులు, డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబరు 09 తేదీ 2023. దరఖాస్తు చేయాల్సిన వెబ్‌సైట్ https://www.rrcecr.gov.in/ కు దరఖాస్తు చేసుకోవాలి.


Tags:    

Similar News