కరోనా వైరస్ తగ్గుతోంది...కేసులు ఎన్నంటే?
కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్నాయి. క్రమంగా వైరస్ అదుపులోకి వస్తుందని నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు.
మొన్నటి వరకూ భయపెట్టిన కరోనా కొంత శాంతించింది. కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్నాయి. క్రమంగా వైరస్ అదుపులోకి వస్తుందని నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా తగ్గుతుంది. ఒక్కరోజులోనే 2.95 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 3,805 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. మరణాల సంఖయ కూడా తగ్గుముఖం పట్టిందని అధికారులు తెలిపారు. ఒక్కరోజులోనే 5,069 మంది కరోనా వైరస్ నుంచి బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అఅధికారులు వెల్లడించారు.
యాక్టివ్ కేసులు....
భారత్ లో ఇప్పటి వరకూ 4.45 కోట్ల మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 4.40 కోట్ల మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 5,28,655 మంది కరోనా వైరస్ కారణంగా మరణించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేశంలో 38,293 యాక్టివ్ కేసులున్నాయి. యాక్టివ్ కేసుల శాతం కూడా 0.09 శాతానికి పడిపోయిందని అధికారులు తెలిపారు. దేశ వ్యాప్తంగా 218.68 వ్యాక్సిన్ డోసులను దేశ వ్యాప్తంగా పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.