మహిళలకు యాభై వేలు.. ఎప్పటి నుంచో చెప్పిన సీఎం
రాష్ట్రంలో నిరుపేద మహిళలకు యాభై వేల రూపాయల చొప్పున అందించనున్నామని ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి తెలిపారు
రాష్ట్రంలో నిరుపేద మహిళలకు యాభై వేల రూపాయల చొప్పున అందించనున్నామని ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి తెలిపారు. సుభద్ర యోజన పథకం కింద మహిళలకు యాభై వేల రూపాయల గిఫ్ట్్ ఓచర్ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎంపీల సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు.
మోదీ పుట్టినరోజు నాడు...
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా సెప్టంబరు 17వ తేదీన సుభద్ర పథకాన్ని ప్రారంభించనున్నట్లు సీఎం మోహన్ చరణ్ మాఝి తెలిపారు. రాష్ట్రంలో ఉన్న నిరుపేద మహిళలకు ఈ పథకాన్ని అందిస్తామని ఆయన చెప్పారు. ఎన్నికల మ్యానిఫేస్టోలో చెప్పినట్లుగానే ఈ పథకాన్ని సెప్టంబరు 17న అమలుపరుస్తామని తెలిపారు.