భారత్ లో వైరస్ వ్యాప్తి ఎలా ఉందంటే?

ఒక్కరోజులో 2,401 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని అధికారులు వెల్లడించారు

Update: 2022-10-16 06:37 GMT

భారత్ లో కరోనా వైరస్ కొంత కంట్రోల్ లోనే ఉన్నట్లు కనిపిస్తుంది. రోజుకు రెండు నుంచి మూడు వేలకు మధ్యన కరోనా కేసులు నమోదవుతున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఒక్కరోజులోనే 2,31,622 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా వీరిలో 2,401 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని అధికారులు వెల్లడించారు. నిన్న ఒక్క రోజులోనే 2,373 మంది కోలుకున్నారని తెలిపారు.

మరణాల సంఖ్య...
భారత్ లో ఇప్పటి వరకూ 4.45 కోట్ల మందికి కరోనా వైరస్ సోకినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వీరిలో 4.40 కోట్ల మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇక రికవరీ రేటు శాతం 98.76 శాతంగా నమోదయింది. యాక్టివ్ కేసుల శాతం 0.06 శాతంగా ఉందని అధికారులు వెల్లడించారు. దేశంలో ఇప్పటి వరకూ 5,28,895 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసులు 26,625 ఉన్నాయన్నారు. ఇప్పటి వరకూ 219.32 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.


Tags:    

Similar News