Hemant Soren : జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్
జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు.;
జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రానికి చెందిన 14వ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ సంతోష్ కుమార్ గాంగ్వార్ సోరెన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. హేమంత్ సోరెన్ జార్ఖండ్ రాష్ట్రానికి నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ కార్యక్రమానికి ఇండియా కూటమి నేతలు రాహుల్ గాంధీ, శరద్ పవార్, మల్లికార్జున ఖర్గే, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ లు హాజరయ్యారు.
ఎన్నికల్లో గెలవడంతో...
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇండియా కూటమి 56 స్థానాల్లో విజయం సాధించిన నేపథ్యంలో హేమంత్ సోరెన్ ను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో జేఎంఎం అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు. తెలంగాణకు చెందిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు భట్టి విక్రమార్క కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.