ఢిల్లీలో ఒమిక్రాన్ టెన్షన్.. ఆంక్షలు షురూ

సౌతాఫ్రికా నుంచి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను భయపెడుతుంది. ఢిల్లీలో నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి

Update: 2021-12-16 08:40 GMT

సౌతాఫ్రికా నుంచి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను భయపెడుతుంది. తాజాగా ఢిల్లీలో నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య పదికి చేరుకుంది. గతంలో ఆరుగురకి ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం తొమ్మిది మంది బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఒకరు చికిత్ప పొంది కోలుకుని వెళ్లిపోయారని వైద్య శాఖ అధికారులు చెప్పారు.

కేసులు పెరుగుతుండటంతో....
అయితే దేశ రాజధానిలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం ఆంక్షలను కఠినతరం చేయాలని నిర్ణయించింది. జనవరి ఒకటో తేదీ వరకూ కఠినమైన ఆంక్షలు విధించింది. బార్లు, రెస్టారెంట్లలో యాభై శాతం మించి అనుమతించవద్దని సూచించింది. ఫంక్షన్ హాళ్లకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని తేల్చి చెప్పింది.


Tags:    

Similar News