భారత్ లో వేగంగా ఒమిక్రాన్.. ఈ ఒక్కరోజే

భారత్ లో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ ఒక్కరోజే దేశంలో పదిహేను ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి

Update: 2021-12-20 07:40 GMT

భారత్ లో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ ఒక్కరోజే దేశంలో పదిహేను ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్ ఒమిక్రాన్ తో ఆందోళన చెందుతున్నట్లయింది. విదేశాల నుంచి వచ్చిన వారితోనే ఈ ఒమిక్రాన్ వేరియంట్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుండటంతో అన్ని ఎయిర్ పోర్టుల్లో నిఘా పెంచారు. అక్కడే పరీక్షలు చేసి పాజిటివ్ వచ్చిన వారిని వెంటనే ఐసొలేషన్ కు తరలిస్తున్నారు. అయినా కేసులు సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది.

పదిహేను కేసులు.....
తాజాగా ఈరోజు భారత్ లో పదిహేను ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. కేరళలో నాలుగు, కర్ణాటకలో ఐదు, ఢిల్లీలో ఆరు కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో భారత్ లో మొత్తం ఒమిక్రాన్ కేసులు సంఖ్య 167 కి చేరింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆంక్షలను కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.


Tags:    

Similar News