భారత్ లో వందకు చేరువలో ఒమిక్రాన్ కేసులు
దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఢిల్లీలో మరో పది మందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకింది.
దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఢిల్లీలో మరో పది మందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకింది. దీంతో ఢిల్లీలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 20కి చేరింది. ఇప్పటి వరకూ దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 97 కు చేరాయి. ఈ కేసుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీలోనే ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా కన్పిస్తున్నాయి. మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులు 32కు చేరుకున్నాయి.
అన్ని రాష్ట్రాల్లో....
ఈ రెండు రాష్ట్రాలతో పాటు రాజస్థాన్ లో 17, తెలంగాణలో 8, కర్ణాటకలో 8, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, కేరళలోనూ ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అయితే ఇందులో కొంత ఊరట కల్గించే అంశం కూడా ఉంది. ఒమిక్రాన్ వ్యాధి సోకి భారత్ లో ఇప్పటి వరకూ ఒక్కరు మాత్రమే మరణించారు. పది మంది వరకూ కోలుకోవడం ఊరట కల్గించే విషయమని అధికారులు తెలిపారు.