భారత్ లో పెరుగుతున్న ఒమిక్రాన్

ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ ప్రజలను భయపెడుతుంది. దేశాలన్నీ ఒమిక్రాన్ తో వణికిపోతున్నాయి

Update: 2021-12-21 02:08 GMT

ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ ప్రజలను భయపెడుతుంది. దేశాలన్నీ ఒమిక్రాన్ తో వణికిపోతున్నాయి. అనేక దేశాల్లో ఈ వేరియంట్ తో మరోసారి లాక్ డౌన్ తప్పదా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. బ్రిటన్ లో ఒమిక్రాన్ మరణాల తీవ్రత ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కల్గిస్తుంది. భారత్ కూడా అందుకు మినహాయింపు కాదు. భారత్ లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది.

11 రాష్ట్రాలకు....
తాజాగా భారత్ లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 173 కు చేరుకుంది. మొత్తం పదకొండు రాష్ట్రాలలో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 28, మహారాష్ట్రలో 54, తెలంగాణలో 20, కర్నాటకలో 19, గుజరాత్ లో 14, రాజస్థాన్ లో 17, కేరళలో పదిహేను, ఉత్తర్ ప్రదేశ్ లో రెండు కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్ ఘడ్ లలోనూ ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.


Tags:    

Similar News