నేడు ప్రధాని ఉన్నతస్థాయి సమావేశం.. లాక్ డౌన్ పై నిర్ణయం ?
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. రోజుకు వేలకు పైగా కేసులతో ప్రజలు భయాందోళలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. రోజుకు వేలకు పైగా కేసులతో ప్రజలు భయాందోళలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్ మహమ్మారిపై ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. చివరిగా గతేడాది డిసెంబర్ 24వ తేదీన ప్రధాని కరోనాపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
తాజాగా నిర్వహించబోయే సమావేశంలో కోవిడ్ కట్టడిని చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే లాక్ డౌన్ పై కూడా ప్రకటన చేసే అవకాశమున్నట్లు సమాచారం. కాగా.. గడిచిన వారంరోజుల్లో దేశంలో కోవిడ్ కేసులు 20 వేల నుంచి 1.6 లక్షలకు పెరిగిపోయాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో భారీ స్థాయిలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షల వలయంలోకి వెళ్లిపోగా.. నేడు తమిళనాడులో ప్రభుత్వం సంపూర్ణ లాక్ డౌన్ ను ప్రకటించింది.