Delhi : అటువైపు వెళ్లకండి.. సరిహద్దులు మూసేశారు

ఢిల్లీ శివారు ప్రాంతాల్లో పెద్దయెత్తున పోలీసులు మొహరించారు. రైతులు ఇచ్చిన ఆందోళనతో పోలీసులు సరిహద్దులను మూసివేశా

Update: 2024-02-12 03:13 GMT

ఢిల్లీ శివారు ప్రాంతాల్లో పెద్దయెత్తున పోలీసులు మొహరించారు. రైతులు ఇచ్చిన ఆందోళనతో పోలీసులు సరిహద్దులను మూసివేశారు. ఎవరూ ఇటువైపు ప్రయాణించవద్దంటూ ఆంక్షలు విధించారు. రైతు సంఘాలు ఈ నెల 13వ తేదీన చలో ఢిల్లీకి రైతు సంఘాలు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. హర్యానా, పంజాబ్ పోలీసులు మాత్రమే కాదు కేంద్ర భద్రతాదళాలు రంగంలోకి దిగాయి. దాదాపు ఇరవై వేలమందికి పైగా రైతులు ఢిల్లీలోకి వచ్చే అవకాశముందని ఇంటలిజెన్స్ హెచ్చరికలతో పోలీసులు సరిహద్దుల్లో బారికేడ్లను నిర్మించారు.

50 కంపెనీల కేంద్ర బలగాలతో....
ఇనుప చువ్వలతో పాటు సిమెంట్ దిమ్మెలను ఏర్పాటు చేసి ఎవరూ ఆందోళనకారులు ఢిల్లీలోకి రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించాలని, 2020లో తమ ఆందోళన సందర్భంగా పెట్టిన కేసులు ఉపసహరించుకోవాలంటూ హర్యానా, పంజాబ్ రైతులు ఆందోళనలకు పిలుపునిచ్చిన సంగతి తెలసిందే. అంబాల, సోనిపట్, పంచకుల్ లో ఇప్పటికే 144 సెక్షన్ విధించారు. యాభై కంపెనీల పారా మిలటరీ దళాలను దించారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ ఈ మార్గాల్లో ప్రయాణించవద్దని సూచిస్తున్నారు


Tags:    

Similar News