PMMVY: ప్రధాన మంత్రి మాతృ వందన యోజన గురించి తెలుసా.. 11000 వస్తాయి
భారత ప్రభుత్వం విభిన్న వర్గాల ప్రజల కోసం అనేక పథకాలు ప్రారంభించింది. అటువంటి
భారత ప్రభుత్వం విభిన్న వర్గాల ప్రజల కోసం అనేక పథకాలు ప్రారంభించింది. అటువంటి పథకం ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY). ఇది జనవరి 1, 2017 నుండి అమలులోకి వచ్చింది. ఈ పథకం జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA)లోని సెక్షన్ 4 ప్రకారం అమలు చేస్తున్నారు. ఈ పథకం గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులకు మద్దతుగా రూపొందించారు. మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు సంబంధించిన పథకం ఇది.
గతంలో ఇందిరా గాంధీ మాతృత్వ సహ్యోగ్ యోజన అని ఈ పథకాన్ని పిలిచేవారు.. ఇప్పుడు ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) అని పిలుస్తూ ఉన్నారు. 2010లో ప్రారంభించిన మెటర్నిటీ బెనిఫిట్ ప్రోగ్రామ్ కు 2017లో పేరు మార్చారు. గర్భం దాల్చిన మహిళల కోసం భారత ప్రభుత్వ మహిళా, శిశు అభివృద్ధి శాఖ PMMVY ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి, బిడ్డ పుట్టే వరకూ మూడు విడతలుగా రూ.11,000 ఆర్థిక సాయం అందించనున్నారు. డీబీటీ ద్వారా మహిళ బ్యాంకు అకౌంట్ లోకి డబ్బులు చేరుతాయి.
ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) కు సంబంధించి అర్హత ప్రమాణాలు:
లబ్ధిదారురాలికి కనీసం 19 సంవత్సరాలు వయస్సు ఉండాలి.
ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన (PMMVY) మొదటి ప్రసవానికి మాత్రమే వర్తిస్తుంది.
బిడ్డ పుట్టిన 270 రోజులలోపు దరఖాస్తుదారు PMMVY స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
నిబంధనల ప్రకారం, ఒక లబ్ధిదారురాలు తన రెండవ గర్భంలో కవలలు.. అంతకంటే ఎక్కువ పిల్లలను ప్రసవిస్తే . ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఆడపిల్లలు అయినట్లయితే, ఆమె రెండవ ఆడబిడ్డకు కూడా ప్రోత్సాహకాన్ని అందుకుంటుంది.
లబ్ధిదారులు https://pmmvy.wcd.gov.inలో నమోదు చేసుకోవాలి.
రిజిస్ట్రేషన్ కోసం, ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) మొబైల్ యాప్ ను కూడా ఉపయోగించుకోవచ్చు