ఈ ఎన్నికలు ఎంతో ప్రత్యేకమైనవి : రాష్ట్రపతి

ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలు గల సేవలందించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు.

Update: 2024-06-27 06:02 GMT

ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలు గల సేవలందించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. అమృతకాలం మొదట్లో పద్దెనిమిదవ లోక్‌సభ కొలువు తీరిందన్నారు. పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. దేశ ప్రజల విశ్వాసం గెలిచి ఎన్నికైన సభ్యులకు రాష్ట్రపతి అభినందనలు తెలిపారు. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తారని ఆశిస్తున్నానని ఆమె తన ప్రసంగంలో అన్నారు. ఈసారి కూడా ప్రజలు సుస్థిరతకు పట్టం కట్టారని, ఈసారి ఎన్నికలు ప్రత్యేకమని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు.

పదేళ్లలో ఈశాన్య రాష్ట్రాల్లో
పదేళ్లలో ఈశాన్య రాష్ట్రాల్లో నాలుగింతల అభివృద్ధి జరిగిందన్నారు. మూడు లక్షల మంది మహిళలను లక్షాధికారులను చేసేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. పౌర విమానరంగంలో అనేక మార్పులు తీసుకు వచ్చామన్న రాష్ట్రపతి పదేళ్లలో లక్షల కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను అభివృద్ధి పరచామని తెలిపారు. దేశంలో సంస్కరణలు మరింత వేగం పుంజుకుంటాయని తెలిపారు. రైతులు, మహిళల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె తెలిపారు. గతంలో కంటే అభివృద్ధి శరవేగంగా జరిగిందన్నారు. అన్ని రంగాల్లో భారత్ మిగలిన దేశాలకంటే ముందుకు వెళుతుండటం సంతోషదాయకమైన విషయమని రాష్ట్రపతి తెలిపారు.


Tags:    

Similar News