హమ్మయ్య... గోల్డ్ రేట్స్ తగ్గాయ్
దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. వెండి ధర మాత్రం భారీగానే తగ్గింది. కిలో వెండి పై రూ.3,900ల వరకూ తగ్గింది.
బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. పెరిగితే ఎక్కువగా తగ్గితే స్వల్పంగా ధరలు ఉండటం సాధారణంగా మారిపోయింది. బంగారానికి ఉన్న డిమాండ్ అటువంటిది. ఎంత ధరలు పెరిగినా కొనుగోలుదారులు మాత్రం వెనుకంజ వేయరు. ధరలు గురించి ఆలోచించరు. తమ వద్ద ఉన్న సొమ్ముకు తగిన బంగారం వస్తుంది కాబట్టి వచ్చినంతే కొంటారు. గ్రాము నుంచి కేజీ వరకూ ఎవరి స్థాయిని బట్టి వారు కొనుగోలు చేస్తారు. పెద్ద స్థాయిలో కొనుగోలు చేసే వారు మాత్రమే ధరలను గురించి ఆలోచిస్తారు. ఆభరణాలను తీసుకునే వారు పెద్దగా ధరలను పట్టించుకోరు. అదే వ్యాపారులకు వరంగా మారింది. జ్యుయలరీ ప్రకటనలు మాదిరి ఏ ప్రకటనలు అంత సులువుగా మనకు కన్పించకపోవడానికి అదే కారణం. వివిధ రకాల డిజైన్లు, ఆఫర్లతో బంగారు దుకాణాలు ఇంటి ముందుకు వస్తుండటంతో బంగారానికి డిమాండ్ పెరిగిపోయిందనే చెప్పాలి.
వెండి భారీగా...
తాజాగా దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. వెండి ధర మాత్రం భారీగానే తగ్గింది. కిలో వెండి పై రూ.3,900ల వరకూ తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50,640 రూపాయలు ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,420 రూపాయలు పలుకుతుంది. ఇక కిలో వెండి ధర ధర బాగా తగ్గి ప్రస్తుతం కిలో వెండి 61,800 రూపాయలకు చేరుకుంది.