ధరలు తగ్గాయి... కొనేందుకు మంచి సమయం

దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల బంగారం ధర పై 220 రూపాయల వరకూ తగ్గింది.

Update: 2022-09-16 02:29 GMT

gold silver rates in hyderabad

బంగారం అందరికీ సొంతం కాదు. ఎందుకంటే పేద, మధ్యతరగతి ప్రజలకు అది అందనంత దూరంగా ఉంటుంది. ఎక్కువ ధర కావడం, దానిని కాపాడుకోవడం కష్టం కావడంతో ఎక్కువ మంది పేదలు, మధ్యతరగతి ప్రజలు ఇన్నాళ్లూ దానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. కానీ ఇటీవల సమాజంలో వస్తున్న మార్పుల కారణంగా వారు కూడా బంగారం కొనుగోళ్లకు ఆసక్తి కనపరుస్తున్నారు. ఎక్కువ బంగారం దుకాణాలు వెలియడం, ఈఎంఐలు పెట్టడంతో బంగారం కొనుగోలు పెద్దగా కష్టం కావడం లేదు. అయితే బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో? ఎప్పుడు తగ్గుతాయో చెప్పలేం. అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదొడుకులు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, డాలర్ విలువలో రూపాయి తగ్గడం వంటి కారణాలుగా బంగారం ధరల్లో మార్పులు సంభవిస్తాయని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

ధరలు ఇలా....
అయితే తాజాగా దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల బంగారం ధర పై 220 రూపాయల వరకూ తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50,400 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,200 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్ లో కిలో వెండి 61, 110 రూపాయలు ఉంది.


Tags:    

Similar News