బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే ధరలు ఇవీ

దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గగా, వెండి ధర భారీగా పెరిగింది. కిలో వెండి పై వెయ్యి రూపాయలు పెరిగింది.

Update: 2022-09-14 02:39 GMT

బంగారం ధరలు ఎప్పుడు మారతాయో చెప్పలేం. ఎప్పుడు చూసినా బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయి. అప్పడప్పుడూ తగ్గుతుంటాయి. పెరిగినప్పుడు భారీగా తగ్గినప్పుడు స్వల్పంగా మాత్రమే బంగారం ధరలు తగ్గుతాయన్నది అందరికీ తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడం వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతారు. అయినా ధరలతో సంబంధం లేకుండా, సీజన్లతో నిమిత్తం లేకుండా కొనుగోలు చేస్తుండటంతో బంగారానికి ఎప్పుడూ డిమాండ్ తగ్గదు. అందుకే దానిని బంగారం అంటారు.

ధరలు ఇలా....
తాజాగా దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గగా, వెండి ధర భారీగా పెరిగింది. కిలో వెండి పై వెయ్యి రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50,980 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,730 రూపాయలు ఉంది. ఇక వెండి ధర కిలో హైదరాబాద్ లో 62,400 రూపాయలు పలుకుతుంది.


Tags:    

Similar News