బ్యాడ్ న్యూస్ .. మళ్లీ పెరిగిన బంగారం ధర

దేశంలో బంగారం ధర ఈరోజు భారీగా పెరిగింది. పది గ్రాముల బంగారం ధరపై రూ.400లు పెరిగింది. కిలో వెండి పై రూ.800లు పెరిగింది

Update: 2023-01-08 03:32 GMT

బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయి. వాటికి కళ్లెం వేయడం సాధ్యం కాదు. తగ్గుతుందని చెప్పినా అది అవివేకమే అవుతుంది. ఎందుకంటే బంగారానికి అంత డిమాండ్ ఉంది. భారత్ లో బంగారానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ప్రతి ఇంట్లో అది ఒక వస్తువుగా మారిపోయింది. రానున్న రోజుల్లో పసిడి ధర 70 వేల రూపాయలకు చేరుకున్నా ఆశ్చర్యం లేదన్నది మార్కెట్ నిపుణులు చెబుతున్నమాట. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతాయమని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. దీంతో బంగారం, వెండి ధరలు సామాన్యులకు అందకుండా పోనున్నాయి. ధనికులకు మాత్రమే బంగారం అందుబాటులో ఉండనుంది.

వెండి కూడా...
తాజాగా దేశంలో బంగారం ధర ఈరోజు భారీగా పెరిగింది. పది గ్రాముల బంగారం ధరపై రూ.400లు పెరిగింది. కిలో వెండి పై రూ.800లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,960 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,300 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక కిలో వెండి ధర 74,400 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News