కొనేసేయేండి.. గోల్డ్ కు గుడ్ డే

ఈరోజు దేశంలో బంగారం ధర స్థిరంగా ఉంది. వెండి రేటు మాత్రం పెరిగింది

Update: 2022-07-31 02:18 GMT

Gold and silver price updates gold and silver price in markets

బంగారం ధరలు పెరుగుతాయని, తగ్గుతాయని గ్యారంటీ లేదు. రోజు వారీగా రేట్లు మారుతుంటాయి. ధరలను చూసి కొనుగోలు చేేసే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. కేవలం పసిడిని పెట్టుబడిగా పెట్టేవారు తప్పించి సాధారణ ప్రజలు ధరలను పెద్దగా పట్టించుకోరు. బంగారం తమ ఇంటికి వస్తే చాలనుకుంటారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయంలో బంగారం ప్రతి ఇంట్లో ఒక వస్తువుగా మారిపోయింది. అపురూపమైన వస్తువును కొనుగోలు చేసుకునేందుకు ముఖ్యంగా భారతీయ మహిళలు ఉత్సాహ పడుతుంటారు. ఆభరణాలు కావచ్చు. లేక మరో వస్తు రూపంలోనైనా బంగారాన్ని ఇంటికి తెచ్చుకుంటే మంచిదిగా భావిస్తారు. ఇక శ్రావణమాసంలో శుభకార్యాలయాల్లో బంగారం వినియోగం ఎక్కువగా ఉంటుంది.

వెండి మాత్రం...
అందుకే ఈ మాసంలో జ్యుయలరీ షాపులన్నీ కిటకిటలాడిపోతుంటాయి. ఒకవైపు పెళ్లిళ్లు మరో వైపు శుభకార్యాలతో బంగారు దుకాణాలు కళకళలాడిపోతాయి. అయితే తాజాగా దేశంలో పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. బంగారం ధర స్థిరంగా ఉంది. వెండి రేటు మాత్రం పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ బంగారం, వెండ ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం దర 47,200 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి 63,700 రూపాయలుగా నమోదయింది.


Tags:    

Similar News