బ్యాడ్ న్యూస్ .. పెరిగిన బంగారం ధరలు

గత కొద్ది రోజులుగా స్వల్పంగా తగ్గిన బంగారం ధర ఈరోజు భారీగా పెరిగింది. పది గ్రాముల బంగారంపై రూ. 270లు పెరిగింది.

Update: 2022-09-04 02:41 GMT

gold silver rates in hyderabad

పసిడి అంటేనే అంతే. ఎప్పుడు ధర పెరుగుతుందో ఎవరికీ తెలియద. తగ్గితే తక్కువగా, పెరిగితే భారీగా పెరిగేదే బంగారం. దానికున్న డిమాండ్ అటువంటిది. బంగారాన్ని మదుపు చేసుకునేందుకు వినియోగం మొదలయినప్పటి నుంచి భారత్ లో ధరలు పెరుగుతూ వస్తున్నాయి. బంగారం ధరల పెరుగుదలతో సంబంధం లేకుండా కొనుగోలు చేస్తున్నప్పటి నుంచే వాటి ధరలకు రెక్కలు వచ్చాయి. బంగారానికి భారత్ లో ఉన్న డిమాండ్ ఎక్కడా ఉండదు. భారత్ లో అత్యంత మంది బంగారాన్ని మాత్రమే ఇష్టపడతారని అనేక సర్వేలు వెల్లడించాయి. భారతీయ సంస్కృతిలో భాగంగా మారిన బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడుతుండటంతోనే దానికి అంత డిమాండ్ పెరిగింది.

వెండి కూడా...
ఇక గత కొద్ది రోజులుగా స్వల్పంగా తగ్గిన బంగారం ధర ఈరోజు భారీగా పెరిగింది. పది గ్రాముల బంగారంపై రూ. 270లు పెరిగింది. వెండి ధర కూడా అదే బాటలో పయనించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50,890 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,650 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 58,200 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News