గుడ్ న్యూస్.. దిగివస్తున్న బంగారం

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ100లు తగ్గగా, వెండి కిలో 6,100 రూపాయలు తగ్గింది

Update: 2022-07-14 02:26 GMT

gold price today

బంగారం ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేం. గత రెండు రోజుులుగా బంగారం ధరలు దిగి వస్తున్నాయి. ధర తగ్గింది స్వల్పంగా అయినా ఇది కొనుగోలుదారులకు ఊరట కల్గించే అంశమే. బంగారాన్ని కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి సమయమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వెండి ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలతో ధరలతో తగ్గుముఖం పడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ధరలు ఇలా...
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ100లు తగ్గగా, వెండి కిలో 6,100 రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,700 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50,950 రూపాయలు ఉంది. కిలో వెండి ధర 61,700 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News