మోజు ఉంటే ఇప్పుడే కొనండి

తాజాగా ఈరోజు బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. మూడు రోజుల నుంచి పెరుగుతున్న ధరలు ఈరోజు తగ్గడం ఊరనిచ్చే అంశమే.

Update: 2022-10-16 03:18 GMT

బంగారానికి ఎప్పుడూ భారత్ లో డిమాండ్ ఉంటుంది. దానిని అలంకార వస్తువుగానే చూడటం లేదు. పెట్టుబడిగా పరిగణించడం మొదలయింది. అప్పటి నుంచి బంగారం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. పేద నుంచి ధనిక వరకూ బంగారం కొనుగోలుపై ఆసక్తిని కనబరుస్తున్నాయి. బంగారం కష్ట సమయాల్లో ఆదుకుంటుండటమే ఇందుకు ప్రధాన కారణం. బ్యాంకులు కూడా కుదవ పెట్టుకుని తక్కువ వడ్డీకి ఇవ్వడం కారణంగా బంగారంపై మోజు పెరిగింది. బంగారాన్ని భూమి తో సమానంగా పరిగణిస్తున్నారు. వాటి ధరను కూడా పెద్దగా లెక్క చేయడం లేదు. దేశంలోని కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పు చేసుకుంటుంది.

తగ్గిన ధరలు...
తాజాగా ఈరోజు బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. మూడు రోజుల నుంచి పెరుగుతున్న ధరలు ఈరోజు తగ్గడం ఊరనిచ్చే అంశమే. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,200 రూపాయలు పలుకుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50,400 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి ధరపై రూ.1800లుతగ్గింది. హైదరాబాద్ లో కిలో వెండి ధర 60,500 రూపాయలుగా నమోదయింది.


Tags:    

Similar News