పరుగులు తీస్తున్న బంగారం ధరలు

శంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారంపై రూ. 500 ల వరకూ పెరిగింది. వెండి కిలోకు రూ.620 పెరిగింది

Update: 2022-11-10 01:59 GMT

బంగారం ధరలు మరింత ప్రియం అయ్యాయి. మూడు రోజుల నుంచి స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. బంగారం అంటే అంతే మరి. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమయ్యే సరికి బంగారానికి డిమాండ్ కూడా పెరిగింది. కొనుగోళ్లు ఎక్కువగా సాగుతున్నాయి. పెళ్లిళ్లు మాత్రమే కాకుండా వేడుకలు కూడా జరుగుతుండటంతో బంగారాన్ని కొనుగోలు చేసే వారి సంఖ్య ఎక్కువగా కనపడుతుంది. బంగారం అంటే భారతీయులకు మహా ప్రీతి. అతి విలువైన వస్తువుగా ఒకప్పుడు భావించే బంగారాన్ని ఇప్పుడు తమ ఇంట్లో వస్తువుగా పరిగణిస్తున్నారు. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి మారకపు విలువ వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అందుకే బంగారం ధరలు పెరిగినా, తగ్గినా కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. ధరలతో సంబంధం లేకుండా కొనుగోళ్లు చేస్తుండటం పరిపాటిగా మారింది.

వెండి మరింత ప్రియం...
ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారంపై రూ. 500 ల వరకూ పెరిగింది. వెండి కిలోకు రూ.620 పెరిగింది. తాజాగా హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,670 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,360 రూపాయలు కొనసాగుతుంది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ 67,400 రూపాయలు పలుకుతుంది.


Tags:    

Similar News