బంగారం ధరలు దిగి వచ్చాయ్
దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారంపై రూ.380లు వరకూ తగ్గింది. ఇక కిలో వెండిపై రూ.600లు తగ్గింది.
బంగారం భారతీయ సంస్కృతిలో భాగమయిపోయింది. ప్రతి ఇంట్లో బంగారం ఒక వస్తువుగా మారింది. ముఖ్యంగా మహిళలు బంగారానికి ఇచ్చిన విలువ ఏ వస్తువుకు ఇవ్వరు. బంగారం విలువైన వస్తువుగా మారిపోవడంతో అది భారతీయ సమాజంలో గౌరవప్రదమైన వస్తువుగా మారింది. సీజన్లతో సంబంధం లేకుండా కొనుగోలు చేయడం ఇప్పుడు ఆనవాయితీగా మారింది. అందుకే భారత్ లో బంగారానికి డిమాండ్ ఎక్కువ. కేంద్రీయ బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం వంటి కారణాలతో బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి.
వెండి కూడా...
తాజాగా దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారంపై రూ.380లు వరకూ తగ్గింది. ఇక కిలో వెండిపై రూ.600లు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,600 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,300 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి ధర 60,700 రూపాయలు. తగ్గినప్పుడే కొనుగోలు చేయడం మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.