గుడ్ న్యూస్.. గోల్డ్ కొనుగోలుకు గుడ్ డే

దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారంపై రూ.380లు తగ్గింది. కిలో వెండి పై రూ.600లు తగ్గింది

Update: 2022-08-28 02:10 GMT

కొద్ది రోజులుగా పెరుతున్న బంగారం ధరలు కొంత తగ్గుముఖం పట్టాయి. బంగారం అంటే అంతే మరి. పెరిగినప్పుడు ఎక్కువగా, తగ్గినప్పుడు తక్కువగా ధరలు ఉంటాయి. వీటిని కొనుగోలుదారులు గమనించినా పుత్తిడి మీద ప్రియం కారణంగా వాటి కొనుగోళ్లు మాత్రం నిలిచిపోవు. గతంలో పెళ్లిళ్లకు, శుభకార్యాలకు మాత్రమే బంగారాన్ని కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు అది మారిపోయింది. బంగారాన్ని ఎప్పుడు డబ్బులుంటే అప్పుడు కొనుగోలు చేయడం మొదలు పెట్టారు. ఒక సీజన్ అంటూ లేకుండా పోయింది. అందుకే బంగారానికి భారత దేశ వ్యాప్తంగా బంగారానికి డిమాండ్ ఏర్పడింది. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు బంగారం ధరల మార్పుల్లో కారణమని చెప్పాలి. ప్రతి ఇంట్లో బంగారం ఒక వస్తువుగా మారిపోయింది. అందుకే గల్లీ గల్లీన జ్యుయలరీ షాపులు వెలిశాయి.

ధరలు ఇలా...
తాజాగా దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారంపై రూ.380లు తగ్గింది. కిలో వెండి పై రూ.600లు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,600 రూపాయలు పలుకుతుంది. అలాగే 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,300 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 60,700 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News