గుడ్ న్యూస్ ... గోల్డ్ రేటు తగ్గింది

దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరలు తగ్గాయి. బంగారం కొనుగోలు చేసే వారికి ఇదే సరైన సమయమని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

Update: 2022-08-17 02:06 GMT

బంగారం అంటేనే అందరికీ మక్కువ. ముఖ్యంగా పసిడి అంటే మహిళలకు అత్యంత ఇష్టం. భారతీయ సంస్కృతిలో బంగారం ఒక భాగమయి పోయింది. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. రెండు రోజులు నుంచి స్థిరంగా ఉన్నాయి. కానీ కొనుగోళ్లు మాత్రం ఆగలేదు. వ్యాపారాలు ఆగస్టు నెలలో జోరుగా సాగుతాయి. పెళ్లిళ్లు సీజన్, శ్రావణ మాసం కావడంతో గోల్డ్ కు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఈ సీజన్ లో జ్యుయలరీ షాపులు కిటకిట లాడుతుంటాయి. బంగారం ధర పెరుగుదల, తగ్గుదలతో సంబంధం లేకుండా కొనుగోళ్లు ఉంటాయి.

వెండి కూడా....
కానీ ఈ సమమయంలో ధరలు తగ్గడం కొనుగోలుదారులను ఆనందపర్చే అంశమే. తాజాగా దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరలు తగ్గాయి. బంగారం కొనుగోలు చేసే వారికి ఇదే సరైన సమయమని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,360 రూపాయల వద్ద కొనసాగుతుంది. 22 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 48,000 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి హైదరాబాద్ మార్కెట్ లో 63,400 రూపాయలు ఉంది.


Tags:    

Similar News