దిగివస్తున్న బంగారం ధరలు

దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరలు తగ్గాయి. పదిగ్రాముల బంగారం ధరపై రూ.100లు, కిలో వెండిపై రూ.400లు తగ్గింది.

Update: 2022-08-21 01:59 GMT

బంగారం ధరలూ ఎప్పుడూ పెరగడమే కాని తగ్గడం చాలా అరుదు. అందుకే చూస్తుండగానే బంగారం అందనంత ధరకు వెళ్లిపోయింది. భారతీయ మార్కెట్ లో బంగారానికి ఉన్న డిమాండ్ అటువంటిది. భారతీయ సంస్కృతిలో బంగారం భాగం కావడంతో బంగారం కొనుగోళ్లు ఆగడం లేదు. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వల కారణంగా బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే గత మూడు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. కొన్ని రోజులు స్థిరంగానూ, మూడు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్నాయి. ఇదే బంగారం కొనేందుకు మంచి సమయమని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

బాగా తగ్గడంతో...
మూడు రోజుల నుంచి ధరలు తగ్గుతుండటం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. తాజాగా దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరలు తగ్గాయి. పదిగ్రాముల బంగారం ధరపై రూ.100లు, కిలో వెండిపై రూ.400లు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,150 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,800 రూపాయలు పలుకుతుంది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి 62,000 రూపాయలు పలుకుతుంది.


Tags:    

Similar News