పసిడి ప్రియులకు శుభవార్త.. గోల్డ్ రేట్లు తగ్గాయ్
రెండు రోజులుగా బంగారం ధర తగ్గుతుంది. దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారం పై రూ.270లు తగ్గింది
పసిడి ప్రియులు ఎక్కువగా ఉండే దేశం భారతదేశం అని చెప్పుకోవాలి. ఎందుకంటే భారతీయ సంస్కృతితలో బంగారం ఒక భాగంగా మారిపోయింది. ముఖ్యంగా మగువలు అత్యంత ఇష్టపడే వస్తువు బంగారం. విలువైన వస్తువు కావడంతో కొంత డిమాండ్ ఉన్నప్పటికీ పేద బీద తేడా లేకుండా తమకు ఉన్నదాంట్లో కొనుగోలు చేయడానికే సిద్ధమవుతారు. సహజంగా అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వల కారణంగా బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటుంటాయి. ముఖ్యంగా శుభకార్యాల్లో ఎక్కువగా బంగారాన్ని వినియోగిస్తారు. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ లేదు. శ్రావణమాసం కూడా వెళ్లిపోవడంతో డిమాండ్ తగ్గడంతో కొంత ధరలు తగ్గుముఖం పట్టాయని చెప్పాలి.
వెండి ధర కూడా...
గత రెండు రోజులుగా బంగారం ధర తగ్గుతుంది. దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారం పై రూ.270లు తగ్గింది. వెండి ధర కూడా బాగా తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50,730 రూపాయల వద్ద ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,500 రూపాయలు పలుకుతుంది. ఇక వెండి ధర కిలో హైదరాబాద్ మార్కెట్ లో 58,000 రూపాయలు ఉంది.