ధరలు తగ్గాయ్.. అయినా కొనలేం
ఈరోజు బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారంపై రూ.100లు తగ్గింది. వెండి కూడా స్వల్పంగానే తగ్గింది.
బంగారం ధరలు తగ్గిందని సంతోపడటానికి వీలులేదు. వంద రూపాయలు తగ్గితే మూడు వందల రూపాయల పెరుగుతూ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ బంగారం అవసరం అయింది. పెళ్లిళ్లల్లో సంప్రదాయంగా వస్తున్న వస్తువుగా మారడంతో తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పుస్తెల తాడు అయినా బంగారం ఉండాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. బంగారు గాజులతో చేతులు మెరిసిపోవాలని భావిస్తుంది. అందుకే భారత్ లో బంగారానికి అంత డిమాండ్. బంగారం విలువైనదిగా మారుతుండటంతో పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో లేకుండా పోతుంది. అయినా అప్పు చేసి కొన్ని కార్యాలకు కొనుగోలు చేయాల్సి వస్తుంది. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. బంగారం ధరలు తగ్గినప్పుడు స్వల్పంగా, పెరిగినప్పుడు ఎక్కువగా ధరలు ఉండటం సహజంగా మారింది.