గుడ్ న్యూస్.. గోల్డ్ ధరలు తగ్గాయ్

దేశంలో బంగారం, వెండి ధరలు బాగా తగ్గాయి. పది గ్రాముల బంగారంపై వంద రూపాయలు తగ్గింది. కిలో వెండి పై రూ.400 తగ్గింది

Update: 2022-08-20 02:00 GMT

బంగారం అంటేనే అందరికీ మక్కువ. బంగారాన్ని పెట్టుబడిగా చూసేవారు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. దీంతోనే కొనుగోళ్లు పెరిగాయి. కేవలం ఆభరణాలుగా మాత్రమే కాకుండా భవిష్యత్ లో ఉపయోగపడే వస్తువుగా బంగారాన్ని చూస్తున్నారు. కొనుగోలు శక్తి కూడా పెరగడంతో బంగారం కొనుగోళ్లు వైపు ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తున్నారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులను అస్సలు పట్టించుకోవడం లేదు. అందుకే భారతదేశంలో రోజురోజుకూ బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం వంటి కారణాలు బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయని చెబుతున్నారు. బంగారం భారతీయ సంస్కృతిలో ఒక వస్తువుగా మారిపోవడంతో దాని విలువ రెట్టింపయిందంటారు.

వెండి కూడా...
తాజాగా దేశంలో బంగారం, వెండి ధరలు బాగా తగ్గాయి. పది గ్రాముల బంగారంపై వంద రూపాయలు తగ్గింది. కిలో వెండి పై రూ.400 తగ్గింది. హైదారాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,150 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,800 రూపాయలు పలుకుతోంది. ఇక కిలో వెండి పై రూ.400ల తగ్గడంతో ప్రస్తుతం కిలో వెండి ధర 62,000 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News