శుభవార్త.. బంగారం ధరలు తగ్గాయి

దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరనలు తగ్గాయి. పది గ్రాముల బంగారం పై రూ. 250లు తగ్గింది

Update: 2022-09-01 02:01 GMT

బంగారాన్ని ఎవరైనా తమ ఇంట్లో వస్తువుగా భావిస్తారు. ముఖ్యంగా భారతీయ సంప్రదాయంలో బంగారం ఒక భాగమయిపోయింది. బంగారం ఎంత ఎక్కువ ఉంటే అంత గౌరవంగా సమాజం చూస్తుందనే ధోరణి ఇప్పటికి గ్రామీణ ప్రాంతాల్లో నెలకొంది. ఇక బంగారు దుకాణాలు ఈఎంఐ పద్ధతులు పెట్టిన తర్వాత దాని కొనుగోలు సులువుగా మారిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారానికి డిమాండ్ పెరగడానికి అది కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవడం కూడా ఒక కారణం కావచ్చు. ముఖ్యంగా కరోనా కష్టసమయంలో బంగారాన్ని కుదువ పెట్టి ఎందరో తమ కడుపులు నింపుకున్నారన్నది కాదనలేని వాస్తవం. అందుకే బంగారానికి విలువ ఎప్పుడూ తగ్గదు. దాని విలువ ఎప్పుడూ తరగదు కూడా. అందుకే భారత్ లో బంగారానికి అంత డిమాండ్ ఉంటుంది.

వెండి కూడా...
తాజాగా దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరనలు తగ్గాయి. పది గ్రాముల బంగారం పై రూ. 250లు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,270 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,000 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధర కూడా బాగానే తగ్గింది. హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.60,000లు పలుకుతుంది. ధరలు తగ్గినప్పుడే కొనుగోలు చేయడం మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.


Tags:    

Similar News