షాకింగ్.. భారీగా పెరిగిన ధరలు
ఈరోజు బంగారం, వెండి ధరలు భారీగానే పెరిగాయి. పది గ్రామలు బంగారంపై రూ.600లు పెరిగింది. కిలో వెండిపై రూ.1400లు పెరిగింది
అందుకే చెప్పేది.. బంగారం ధరలు ఎప్పుడు తగ్గితే అప్పుడు కొనుగోలు చేయాలనేది. ఒకరోజు వెయిట్ చేద్దామనుకుంటే ధర మరింత పెరుగుతుంది. దీపావళి నాటికి బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ప్రభావం కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతుంది. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా కొద్ది కొద్ది మొత్తాన్ని కూడబెట్టుకుని బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. అలాంటి వారు ధర తగ్గినప్పుడు మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. గత కొద్దిరోజులుగా తగ్గడం, స్థిరంగా ఉండటం సాగుతున్న బంగారం ధరలు ఇప్పుడు పెరిగాయి.
మార్కెట్ లో ఇలా...
దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరలు భారీగానే పెరిగాయి. పది గ్రామలు బంగారంపై రూ.600లు పెరిగింది. కిలో వెండిపై రూ.1400లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50,620 రూపాయలుగా కొనసాగుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,400 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 61,500 రూపాయలకు చేరుకుంది.