పుత్తడి ప్రియులకు శుభవార్త

దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారం పై రూ.700లు తగ్గింది

Update: 2023-02-05 02:55 GMT

బంగారం ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బడ్జెట్ లో బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీ పెంచిన తర్వాత బంగారం ధరలు పెరుగుతున్నాయి. దీని ప్రభావంతో ధరలు పెరిగాయి. బంగారాన్ని కొనుగోలు చేయాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. పెట్టుబడిగా చూసే వారు సయితం ఇతర మార్గాలను అన్వేషిస్తున్నారు. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపొయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలు అందనంత దూరంలో ఉండటంతో కొనుగోలు దారులు కూడా తగ్గిపోయారు. దీంతో పాటు భారత ప్రభుత్వం బంగారం దిగుమతిని కూడా తగ్గించింది. రూపాయి బలపడటం కోసం బంగారం దిగుమతిని తగ్గించిందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో పసిడి ప్రియులకు శుభవార్త చెప్పింది.

భారీగా తగ్గిన వెండి...
తాజాగా దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారం పై రూ.700లు తగ్గింది. కిలో వెండిపై 2,600 రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,400 రూపాయలు పలుకుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,160 రూపాయలు పలుకుతుంది. హైదరాబాద్ లో కిలో వెండి ధర 74,200 రూపాయలుగా కొనసాగుతుంది.


Tags:    

Similar News