పసిడి ప్రియులకు షాకింగ్.. పెరిగిన బంగారం ధర

రెండు రోజులుగా తగ్గిన బంగారం, వెండి ధరలు ఈరోజు పెరిగాయి. పది గ్రాముల బంగారంపై రూ.250లు పెరిగింది

Update: 2022-08-25 02:31 GMT

బంగారం, వెండి భారతీయుల ఇళ్లలో అపురూప వస్తువులుగా మారిపోయాయి. బంగారం కొనుగోలు చేయాలంటే అంత సులువు కాదు. వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అందుకే పేద, మధ్య తరగతి ప్రజలకు బంగారం, వెండి అందుబాటులోకి జ్యుయలరీ షాపులు తీసుకొచ్చాయి. స్కీమ్ లతో ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ప్రతి ఇంట్లో ఆభరణాల కోసం భారతీయ మహిళలు బంగారం కోసం పరితపిస్తుంటారు. వారి కోసమే కొత్త కొత్త స్కీమ్ లను జ్యుయలరీ షాపులు ప్రకటిస్తున్నాయి. దీని వల్ల బంగారం కొనుగోళ్లు పెరగడమే కాకుండా వాటి డిమాండ్ కూడా పెరుగుతుంది. ఇక కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం వంటి కారణాలతో బంగారం ధరలలో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటాయి.

వెండి ధర కూడా....
గత రెండు రోజులుగా తగ్గిన బంగారం, వెండి ధరలు ఈరోజు పెరిగాయి. పది గ్రాముల బంగారంపై రూ.250లు పెరిగింది. కిలో వెండి వందరూపాయల వరకూ పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,500 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,250 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్ లో కిలో వెండి ధర 60,900 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News