గోల్డ్ రేట్స్ టుడే

కొద్దిరోజులుగా పెరుగుతూ, స్థిరంగా ఉన్న బంగారం, వెండి ధరలు నేడు దేశ వ్యాప్తంగా స్వల్పంగా తగ్గాయి.

Update: 2022-10-11 02:17 GMT

బంగారం ధరలు వాటంతట అవే పెరగవు. వాటిని ఎవరూ పెంచరు. తగ్గించరు. కొన్ని కారణాల రీత్యా బంగారం ధరల్లో దేశంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఇప్పుడు పేద, ధనిక తేడా లేకుండా బంగారం కొనుగోలు చేస్తుండటంతో డిమాండ్ కు ఏ మాత్రం కొదువలేదు. చిన్న స్థాయి పట్టణం నుంచి మహానగరం వరకూ అనేక దుకాణాలు మనకు ఎన్నో ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తరుగులో పర్సంటేజీ లేదని కొందరు, ఉందని మరి కొందరు పసిడి ప్రియులను ఆకర్షిస్తుంటారు. ఇక ఎన్నో స్కీమ్ లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అందుకే బంగారం ఈరోజుల్లో వాయిదా పద్ధతుల్లో కొనడం సులువుగా మారింది. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి విలువ వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్న మాట.

స్వల్పంగా తగ్గిన....
కొద్దిరోజులుగా పెరుగుతూ, స్థిరంగా ఉన్న బంగారం, వెండి ధరలు నేడు దేశ వ్యాప్తంగా స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,600 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,930 రూపాయలు పలుకుతుంది. ఇక వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. వెండి కిలో ధర 64,800 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News