బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్

నిన్న మొన్నటి వరకూ పెరిగిన బంగారం, వెండి ధరలు నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి

Update: 2022-12-12 02:27 GMT

బంగారం ధరలు అంతే. ఒకసారి పెరిగితే తగ్గడం అరుదుగా జరుగుతుంటుంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. కొనుగోళ్లు పెరగడంతో డిమాండ్ కు తగినట్లుగా బంగారాన్ని దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరల పెరుగుదల్లో మార్పులు చోటు చేసుకుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. అయితే బంగాారానికి ధరలు పెరగడమే తప్ప తగ్గడం అనేది తెలియదు. అందుకే పేద, మధ్యతరగతి వర్గాలకు బంగారం అపురూపమైన వస్తువుగా మారిపోయింది. బంగారాన్ని కొనుగోలు చేయాలంటే తలకు మించిన భారంగా మారింది. తప్పనిసరి అయితేనే బంగారం కొనుగోలు చేసే రోజులు వచ్చేశాయన్నది వాస్తవం.

స్థిరంగా కొనసాగుతున్న...
నిన్న మొన్నటి వరకూ పెరిగిన బంగారం, వెండి ధరలు నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. కొనుగోలుదారులకు ఇది ఊరట కలిగించే అంశమే. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 54,440 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,900 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక కిలో వెండి ధర 73,000 రూపాయల వద్ద స్థిరంగా కొనసాగుతుంది.


Tags:    

Similar News