పసిడి ప్రేమికులకు షాక్
గత కొద్ది రోజులుగా తగ్గిన, స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు ఒక్కసారిగా పెరాగాయి.
బంగారం ధరలు ఎందుకు ఎప్పడు పెరుగుతాయో చెప్పలేం. దీపావళి నాటికి బంగారం ధరలు మాత్రం భారీగా పెరుగుతాయని చెబుుతున్నారు మార్కెట్ నిపుణులు. ఇది అంచనా మాత్రమే అయినా బంగారం కొనుగోలు చేసే వారు అంతకంటే ముందుగానే కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు. బంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలుంటాయి. ఏ కారణంతో పెరిగాయన్నది స్పష‌్టంగా చెప్పలేం. బంగారానికి ఉన్న డిమాండ్ అలాంటిది. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలు బంగారం ధరల హెచ్చు, తగ్గుదలకు కారణమవుతాయని మాత్రం మార్కెట్ నిపుణులు నిత్యం చెబుతూనే ఉంటారు.
పెరిగిన ధరలు....
గత కొద్ది రోజులుగా తగ్గిన, స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు ఒక్కసారిగా పెరాగాయి. హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,110 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,850లుగా కొనసాగుతుంది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి 62,500 రూపాయల వద్ద కొననసాగుతుంది.