Union Budget : పెరిగేవి ఇవి... తగ్గేవి ఇవి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తో కొన్ని వస్తువుల ధరలు పెరిగాయి. మరికొన్న వస్తువులు తగ్గాయి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తో కొన్ని వస్తువుల ధరలు పెరిగాయి. మరికొన్న వస్తువులు తగ్గాయి. మొబైల్ ధరలు తగ్గనున్నాయి. మొబైల్ విడిభాగాలపై కస్టమ్స్ డ్యూటీని తగ్గించారు. అలాగే టీవీల ధరలు కూడా తగ్గనున్నాయి. విడిభాగాలపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం వల్ల టీవీ ధరలు కూడా తగ్గనున్నాయి. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కూడా తగ్గనున్నాయి.
బంగారం..వెండి....
ఇక పెరిగేవి మాత్రం బంగారం, వెండి ధరలు భారీగా పెరిగే అవకాశముంది. బంగారం, వెండ ధరలపై కస్టమ్స్ డ్యూటీని పెంచడంతో ధరలు కూడా పెరగనున్నాయి. బ్రాండెడ్ వస్తువుల ధరలు కూడా పెరగనున్నాయి. సిగిరెట్ల ధరలు కూడా పెంచారు. ఇక విదేశాల నుంచి దిగుమతి అయ్యే రబ్బరు ధరపై కస్టమ్స్ డ్యూటీ పెంచడంతో టైర్ల ధరలు కూడా పెరగనున్నాయి