సైనికుల కోసం.. మేమున్నామంటూ.. మోదీ సత్కారం

సియాచిన్ ప్రాంతంలో సైనికులకు అండగా నిలిచేందుకు కృషి చేసిన యోగేష్, సుమీధాలను ప్రధాని అభినందించారు

Update: 2024-05-15 05:12 GMT

సియాచిన్ ప్రాంతంలో సైనికులకు అండగా నిలిచేందుకు కృషి చేసిన యోగేష్, సుమీధాలను ప్రధాని అభినందించారు. పూనేకు చెందిన వీరు సైనికుల కోసం తమ సొంత డబ్బుతో ఆక్సిజన్ ప్లాంట్ ను నిర్మించారు. వారు పొదుపు చేసుకున్న మొత్తం నుంచి వెచ్చించి ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టి  సైనికులకు అండగా నిలిచారు. ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణం కోసం తాము పొదుపు చేసిన మొత్తం సరిపోకపోవడంతో వారి వద్ద ఉన్న బంగారు నగలను కూడా విక్రయించారు.

ఆక్సిజన్ ప్లాంట్ ను ఏర్పాటు చేసి....
దీంతో 1.25 కోట్ల రూపాయలు కూడబెట్టి ఆక్సిజన్ ప్లాంట్ ను నిర్మించారు. సియాచిన్ లో సైనికులు ఎదుర్కొంటున్న శ్వాస సంబంధిత సమస్యల గురించి తెలిసినప్పుడు తనకు ఈ ఆలోచన వచ్చిందని యోగేష్ తెలిపారు. ఆయన ఎయిర్‌ఫోర్స్ అధికారిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. వీరు నెలకొల్పిన ఆక్సిజన్ యూనిట్ ద్వారా సియాచిన్ లో ఇరవై వేల మంది భారత సైనికులకు ఆక్సిజన్ అందిస్తుంది. అందుకోసమే ప్రధాని నరేంద్ర మోదీ వారిని పిలిపించి దంపతులిద్దర్నీ సన్మానించారు.


Tags:    

Similar News