పుల్వామా అమర జవాన్లకు మోదీ నివాళులు

పుల్వామా అమరవీరులకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. పుల్వామా ఉగ్రవాద జరిగి నేటికి మూడేళ్లయింది

Update: 2022-02-14 06:22 GMT

పుల్వామా అమరవీరులకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. పుల్వామా ఉగ్రవాద జరిగి నేటికి మూడేళ్లయింది. పాక్ ఉగ్రవాదులు భారత సైనికులపై దాడి చేసి నలభై మంది జవాన్ల ప్రాణాలను బలితీసుకు్నారు. జమ్మూ నుంచి సైనికులు వెళుతుండగా ఈ దాడి జరిగింది. జైషే మహమ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడగా నలభై మంది భారత జవాన్లు మృతి చెందారు.

ప్రతీకారంగా....
పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. 2019 ఫిబ్రవరి 14న ఈ దాడి జరిగిందని, దేశానికి వారు అందించిన సేవలను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని మోదీ తెలిపారు. జవాన్ల ధైర్యసాహసాలు ఎప్పటికీ భారతీయులకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత సైన్యం సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించింది.


Tags:    

Similar News