ప్రధాని గారూ థ్యాంక్స్... ఆ వాహనం వాడినందుకు?
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్రా ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్రా ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. దేశీయ వాహనంలో ప్రధాని పర్యటించడం ఆనందించగలిగిన విషయమని ఆయన ట్వీట్ చేశారు. మేడిన్ ఇండియా వెహికల్ కంటే మెరుగైనది ఏదీ లేదని ఆనంద్ మహీంద్రా అన్నారు. ఈ వాహనాన్ని ఉపయోగించినందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
గుజరాత్ రోడ్ షోలో.....
ప్రధాని నరేంద్ర మోదీ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత గుజరాత్ లో పర్యటించారు. గుజారత్ లో రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహేంద్రా థార్ వెహికల్ రోడ్ షోలో పాల్గొన్నారు. దాదాపు 9 కిలోమీటర్లు ప్రధాని ఈ వాహనంలో ప్రయాణించారు. దీనిని ఉదహరిస్తూ ఆనంద్ మహేంద్ర ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు.