School Holidays: పాఠశాలలకు సెలవులు.. పరీక్షలు వాయిదా
భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల కారణంగా
భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల కారణంగా.. మహారాష్ట్ర స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ (MSBSHSE) సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ (SSC), హయ్యర్ సెకండరీ సర్టిఫికేట్ (HSC) కోసం జరుగుతున్న రిపీటర్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. శుక్రవారం జరగాల్సిన పేపర్‌లను రీ షెడ్యూల్ చేశారు.
మహారాష్ట్ర స్టేట్ బోర్డ్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం పేపర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ 2 జూలై 26న ఉదయం సెషన్‌లో ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు జరగాల్సి ఉంది. ఈ పరీక్షను జూలై 31 ఉదయం సెషన్‌లో నిర్వహించనున్నారు. హెచ్‌ఎస్‌సికి సంబంధించి, కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్, ఫుడ్ టెక్నాలజీ, ఎంసివిసి పేపర్ 2 నేడు జరగాల్సి ఉండగా.. ఈ పేపర్లన్నీ ఆగస్టు 9న ఒకే సెషన్‌లో నిర్వహించనున్నారు.
భారత వాతావరణ శాఖ (IMD) ముంబై నగరం, దాని శివారు ప్రాంతాలకు 'రెడ్' అలర్ట్ ను జారీ చేసింది. భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో థానే మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పటికే తన పరిధిలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించింది. పూణే నగరాన్ని కూడా వర్షాలు అతలాకుతలం చేశాయి. ఎక్కడిక్కడ నీరు నిలిచిపోవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది.