రాజస్థాన్ సీఎం సంచలన వ్యాఖ్యలు
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దళిత బాలుడిని కొట్టి చంపిన సంఘటనపై ఆయన స్పందించారు
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దళిత బాలుడిని కొట్టి చంపిన సంఘటనపై ఆయన స్పందించారు. ఇలాంటి ఘటనలు ప్రతి చోటా జరుగుతుంటాయని అన్నారు. టీవీలో, పత్రికల్లో ప్రతి రోజూ వీటిని మనం చూస్తూనే ఉంటామని చెప్పారు. ఏ రాష్ట్రంలో జరిగినా అది తప్పేనని అన్నారు. ఈ ఘటనను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. ప్రతిపక్షాలు ఇలాంటి ఘటనలను రాజకీయంగా మలచుకునేందుకు ప్రయత్నించడం విచారకరమని అశోక్ గెహ్లాత్ అభిప్రాయపడ్డారు.
ఇంతకంటే ఏం చేయాలి?
రాజస్థాన్ లోని జాలోర్ లో తొమ్మిదేళ్ల దళిత బాలుడు కుండలో నీరు తాగినందుకు ఉపాధ్యాయుడు కొట్టాడు. తీవ్రంగా కొట్టడంతో ఆ బాలుడు మరణించాడు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ మాత్రం తాము దాడికి పాల్పడిన ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేశామన్నారు. ఇంతకంటే ఏం చేయాలని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షాలకు వేరే పనిలేకుండా పోయిందని ఆయన అన్నారు.