టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా దాతృత్వ రంగానికి చేసిన కృషికి గాను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్) అనుబంధ సేవా భారతి శుక్రవారం 'సేవా రత్న' అవార్డును ప్రదానం చేసింది. అయితే ఆయన ఈ ఫంక్షన్‌కు హాజరు కాలేకపోయారు. సేవా భారతి.. సేవా రత్న అవార్డులను శుక్రవారం అందజేసింది. టాటా సంస్థల మాజీ చైర్మన్ రతన్ టాటా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చలసాని బాబూ రాజేంద్రప్రసాద్‌తోపాటు మరో 24 మంది వ్యక్తులు, సంస్థలకు కూడా ఈ పురస్కారాలు అందజేసింది. ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్(రిటైర్డ్) చేతుల మీదుగా జరిగిన ఈ కార్యక్రమానికి రతన్ టాటా హాజరుకాలేదని ఆ సంస్థ తన ప్రకటనలో పేర్కొంది.
'సామాజిక సేవలో అమూల్యమైన సహకారం అందించినందుకు లేదా సామాజిక అభివృద్ధికి నిధులు అందించినందుకు' ప్రముఖ, విశిష్ట వ్యక్తులకు ఈ గౌరవం లభించిందని సేవా భారతి ఒక ప్రకటనలో తెలిపింది. సేవా భారతి ఒక ప్రకటనలో, "ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్ (రిటైర్డ్) హాజరైన కార్యక్రమంలో నిస్వార్థ సామాజిక సేవ చేసిన మరో ఇరవై నాలుగు మంది ప్రముఖులు మరియు సంస్థలు కూడా అవార్డు పొందాయి." (sic) అని ఉంది. సేవా భారతి నుంచి సేవకు అర్థం నేర్చుకోవచ్చని, నిస్వార్థాన్ని తలపించే సంస్థ ఇదని ఉత్తరాఖండ్ గవర్నర్ అన్నారు. ఎవరూ లేని వ్యక్తికి సేవా భారతి ఉందని ఆయన అన్నారు. ప్రైమ్ మినిస్టర్స్ సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ ఫండ్ (PM-CARES) కొత్త ట్రస్టీలలో ఒకరిగా రతన్ టాటా ఇటీవలే ఎంపికయ్యారు.