మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు

తాజాగా బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. పది గ్రాముల బంగారం పై దాదాపు రూ200లు పెరిగింది.

Update: 2023-01-14 02:42 GMT

సంక్రాంతి పండగకు అందరూ ఆనందంగా ఉన్న సమయంలో బంగారం ప్రియులకు మాత్రం షాక్ ఇచ్చింది. వరసగా రెండు రోజుల పాటు ధరలు పెరుగుతుండటంతో పసిడిప్రియులకు బంగారం అందని వస్తువుగా మారే పరిస్థితి కనపడుతుంది. కేంద్ర బ్యాంకుల్లో బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. పసిడి మరింత పెరుగుతుందని మార్కెట్ నిపుణులు చేస్తున్న హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది తులం బంగారం 70వేలకు చేరుకునే అవకాశముందన్న అంచనా వినపడుతుంది.

వెండి మాత్రం...
తాజాగా బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. పది గ్రాముల బంగారం పై దాదాపు రూ200లు పెరిగింది. వెండి కూడా అదే బాటలో పయనిస్తుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,920 రూపాయల వద్ద కొనసాగుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,600 రూపాయలు పలుకుతుంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 74,000 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News