పెరిగిన బంగారం.. స్థిరంగా వెండి

తాజాగా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి

Update: 2022-10-17 02:35 GMT

బంగారం అంటేనే డిమాండ్. దానికి విలువ ఎక్కువ. తమ కున్న కొద్దిపాటి సొమ్ములతో ఈరోజుల్లో బంగారమే కొనుగోలు చేయాలనుకుంటారు. ధరలతో సంబంధం లేకుండా కొనుగోలు చేస్తారు. కారణం అది ప్రతి ఇంట్లో ఒక వస్తువుగా మారిపోయింది. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతాయి. తగ్గుతాయి. అయినా బంగారం విషయంలో మాత్రం ఇవేమీ పట్టించుకోరు. పెట్టుబడిగా చూడటం ప్రారంభమయిన నాటి నుంచి దీని డిమాండ్ ఎక్కువయింది. అందుకే వీధికో జ్యుయలరీ షాపు వెలిసింది. ఆకర్షణీయమైన డిజైన్లతో ఆకట్టుకుంటుండటం కూడా కొనుగోళ్లు పెరగడానికి కారణంగా చెప్పాలని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీపావళికి ధరలు మరింత పెరుగుతాయని అంటున్నారు. అందుకోసమే ఇటీవల బంగారం కొనుగోళ్లు మరింత పెరిగాయంటున్నాయి వ్యాపార వర్గాలు

ధరలు ఇలా...
తాజాగా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50,670 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,450 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ లో 60,500లు గా ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.


Tags:    

Similar News