ఫిబ్రవరి 15 వరకూ పాఠశాలలు మూసివేత
ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కొన్ని రాష్ట్రాల్లో పాఠశాలలు పునః ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో
ఒక పక్క కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరోపక్క స్కూళ్లకు పొడిగించిన సెలవులు జనవరి 31తో ముగియనున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కొన్ని రాష్ట్రాల్లో పాఠశాలలు పునః ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో యూపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్కడి పాఠశాలలు, కళాశాలలను ఫిబ్రవరి 15వ తేదీ వరకూ మూసివేయాలని యోగి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఆన్ లైన్ తరగతులనే యథాతథంగా కొనసాగించాలని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.
గతంలో కరోనా కేసుల విజృంభణ నేపథ్యంలో జనవరి 30వ తేదీ వరకూ యూపీ విద్యాసంస్థలను మూసివేయాలని యోగి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ రాష్ట్రంలో కరోనా కట్టడి కాకపోగా.. పాజిటివిటీ రేటు పెరుగుతుండటంతో.. ముందుజాగ్రత్త చర్యగా విద్యాసంస్థలను మూసివేయాలని నిర్ణయించింది. యూనివర్సిటీ-కాలేజీ సెమిస్టర్ పరీక్షలు ఇప్పటికే వాయిదా పడగా.. జనవరి 16వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు జరగాల్సిన సెమిస్టర్ పరీక్షలను కూడా వాయిదా వేసింది.