నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం
కర్ణాటకలో పాఠశాలలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కళాశాలలను తెరవడంపై మాత్రం ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు
కర్ణాటకలో పాఠశాలలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కళాశాలలను తెరవడంపై మాత్రం ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. హిజాబ్ వివాదం తలెత్తడంతో కర్ణాటకలో విద్యాసంస్థలను మూసివేశారు. ఈరోజు నుంచి పాఠశాలలను మాత్రం తెరవాలని ప్రారంభించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 144వ సెక్షన్ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానంగా ఉడిపి ప్రాంతంలో 144వ సెక్షన్ నేటి నుంచి ఈనెల 19వ తేదీ వరకూ అమలులో ఉంటుంది.
అక్కడ 144 సెక్షన్...
ఇక కళాశాలలను తెరవడంపై మాత్రం ప్రభుత్వం ఇంకా నిర్ణయానికి రాలేదు. హిజాబ్ వివాదం కళాశాలల్లోనే ఎక్కువగా కనపడుతుంది. ఈరోజు హైకోర్టులో దీనిపై విచారణ జరగనుంది. విచారణలో తేలిన తర్వాత పూర్తి స్థాయిలో నిబంధనలను అమలు చేస్తూ కళాశాలలను తెరవాలని ప్రభుత్వం భావిస్తుంది. నేటి నుంచి పాఠశాలలు తెరుచుకోనుండటంతో ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ప్రత్యేకంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.